Header Banner

ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈఏపీసెట్‌ 2025 నోటిఫికేషన్ విడుదల! పరీక్ష తేదీలు ఇవే!

  Wed Mar 12, 2025 18:44        Education

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ప్రకటనల విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్‌ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. ఈఏపీసెట్‌ 2025లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏపీలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 24, 2025వ తేదీ వరకు కొనసాగుతాయి.


ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!

ఇక ఏపీ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో మే 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మే 21 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. దరఖాస్తులకు సంబంధించిన విద్యాప్రమాణాలు, అర్హతలు, ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీలు, పరీక్షల సిలబస్‌ వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు.

రైల్వే శాఖ అసిస్టెంట్‌ లోకో పైలట్‌ సీబీటీ- 2 పరీక్షల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను తాజాగా విడుదల చేసింది. రెండో విడత పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులోని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీటీ I ఫలితాలను, కట్‌ఆఫ్‌ మార్కులను విడుదల చేయగా అందులో మొత్తం 1,251 మంది అభ్యర్ధులు సీబీటీ-2 పరీక్షకు ఎంపికయ్యారు. సిటీ ఇంటిమేషన్‌ వివరాల్లో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ నెం.9513631459 ను సంప్రందించవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. పరీక్షకు నాలుగు రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు. మార్చి 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!


టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!



అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #eapcet #test #examnotification #release #todaynews #flashnews #latestnews